వాళ్లు ఇయ్యకపోతే మేము ఇస్తాం

బీజింగ్ : వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( డబ్ల్యూహెచ్ఓ) కు అండగా ఉంటామని చైనా ప్రకటించింది. చైనాకు డబ్ల్యూహెచ్ఓ అనుకూలంగా వ్యవహారిస్తుందంటూ అమెరికా నిధులు ఆపేయటంతో ఆర్థిక సహాయం అందించేందుకు డ్రాగన్ కంట్రీ ముందుకు వచ్చింది. తమ వాటా 20 మిలియన్ డాలర్లు కాకుండా అదనంగా మరో 30 మిలియన్ డాలర్లను ఇస్తామని చైనా ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ జెంగ్ షువాంగ్ తెలిపారు. అమెరికా నిధులు ఇవ్వటం ఆపేస్తే మేము సహాయం చేస్తామని ఇప్పటికే చైనా ప్రకటించింది. అందుకు అనుగుణంగా గురువారం 30 మిలియన్ డాలర్లును ప్రకటించింది. ఐతే అమెరికా ఇచ్చే నిధుల్లో ఇది 10 శాతం కూడా కాదు. అవసరమైతే మరింత ఎక్కువ ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం చేస్తామని చైనా తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ కు అమెరికా నిధులు నిలిపివేయటాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని….ప్రస్తుత పరిస్థితిలో తాము అండగా ఉంటామని ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ వైఖరికి చైనా కు అనుకూలంగా ఉందంటూ అమెరికా సహా పలు దేశాలు విమర్శిస్తున్న సమయంలో చైనా మరింత ఆర్థిక సహాయం ప్రకటించటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Latest Updates