వీధులు క్లీన్ చేసిన జవాన్లు

హాంకాంగ్‌లో సివిల్ డ్రెస్‌లో క్లీనింగ్‌కి దిగిన చైనా ఆర్మీ

బీజింగ్: ప్రో-డెమొక్రసీ ఆందోళనలు మొదలైన తర్వాత చైనా ఆర్మీ తొలిసారి హాంకాంగ్​లో అడుగుపెట్టింది. దాదాపు ఐదు నెలలుగా నిరసనలు, ఆందోళనలు, ఉద్రిక్తత కొనసాగుతుంటే .. శనివారం చైనా బలగాలు
హాంకాంగ్​లోకి ప్రవేశించాయి. హాంకాంగ్​ గ్యారీసన్ ఆఫ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీ-ఎల్ఏ)కి చెందిన జవాన్లు సివిల్ డ్రెస్సుల్లో సిటీలోకి వచ్చి.. బాప్టిస్ట్​ యూనివర్సిటీ క్యాంపస్​ పరిసరాల్లో బారికేడ్లను, వీధుల్లో ఉన్న ఇతర చెత్తను తొలగించారు. బ్లాక్​షార్ట్స్, గ్రీన్ టీషర్ట్స్ వేసుకున్న జవాన్లు రెడ్ బకెట్లు పట్టుకుని క్లీనింగ్​చేశారు. చైనా సోల్జర్లతో పాటు పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా క్లీనింగ్​లో పాల్గొన్నారు.

గత ఏడాది అక్టోబర్​లో చైనా జవాన్లు హాంకాంగ్​లో పబ్లిక్ కమ్యూనిటీ వర్క్​లో పాల్గొన్నారు. హాంకాంగ్​ గవర్నమెంట్‌తో తమకు సంబంధం లేదని, తామే ఈ క్లీనింగ్​ మొదలుపెట్టామని, వాయిలెన్స్‌ను ఆపేసి.. విధ్వంసానికి ముగింపు పలకడమే తమ బాధ్యత అని ఓ చైనా జవాన్ అన్నాడు. కొద్దిరోజుల క్రితం చైనా ప్రెసిడెంట్ జి జిన్ పింగ్​ కూడా ఇవే మాటలు చెప్పారు. కాగా, మిలటరీ సైట్లకు వెలుపల వాలంటరీ సర్వీసు కోసం జవాన్లను పంపే విషయంలో పీఎల్ఏనే సొంతంగా నిర్ణయం తీసుకుందని, దీనిపై లోకల్ గవర్నమెంట్‌కు సమాచారం లేదని హాంకాంగ్​ సెక్రెటరీ ఫర్​ సెక్యూ రిటీ జాన్ లీ కుచియు చెప్పారు.

Latest Updates