ఈ ఏడాది నవంబర్ లో కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసే అవకాశం ఉంది : ప్రకటించిన చైనా

చైనా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది నవంబర్ లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)అఫీషియల్ గా ప్రకటించింది.

ప్రస్తుతం చైనాలో నాలుగు కంపెనీల వైరస్ వ్యాక్సిన్లు హ్యూమన్ ట్రయల్స్ మూడో దశలో ఉన్నాయి. అందులో ఒక వ్యాక్సిన్ ను అత్యవసర పరిస్థితుల్లో వైద్యరంగానికి చెందిన సిబ్బంది, డాక్టర్లు వినియోగించుకునేందుకు ఈ ఏడాది జులైలో చైనా ప్రభుత్వం వారికి అనుమతిచ్చింది.

తాజాగా కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ పై చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చీఫ్ బయో సేప్టీ ఎక్స్ పర్ట్ గుయిజెన్ వు మీడియాతో మాట్లాడుతూ నవంబర్ లో ఓ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఏప్రిల్‌లో తానే స్వయంగా ఓ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు, వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత తనకు ఎలాంటి అసాధారణ పరిస్థితులు తలెత్తలేదని తెలిపారు.కానీ ఆమె ఏ వ్యాక్సిన్ వేయించుకున్నారో చెప్పలేదు.

కాగా డ్రాగన్ కంట్రీలో చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ (సినోఫార్మ్), యూఎస్ కు చెందిన సినోవాక్ బయోటెక్ కంపెనీలు అత్యవసర పరిస్థితుల కింద మూడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి.

కాన్సినో బయోలాజిక్స్ అభివృద్ధి చేస్తున్న నాల్గవ కరోనా వ్యాక్సిన్ జూన్‌లో చైనా మిలటరీ ఉపయోగించుకునేలా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆమోదం తెలిపారు.
3వ దశ ట్రయల్స్ ముగిసిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికి దాని వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సినోఫార్మ్ ఈ ఏడాది జూలైలో తెలిపింది.

Latest Updates