కరోనాపై ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌కు చైనా పర్మిషన్ ఇస్తలే

డ్రాగన్ తీరుపై డబ్ల్యూహెచ్​వో అసంతృప్తి

జెనీవా: కరోనా వైరస్ పుట్టుకపై ఇన్వెస్టిగేషన్ కోసం ఎక్స్ పర్ట్స్ టీమ్​పర్యటనకు చైనా ఇంకా పర్మిషన్ ఇవ్వకపోవడంపై వరల్డ్​హెల్త్ ​ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్​వో) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏడాది కింద చైనాలోని వూహాన్​లో ఫస్ట్ టైమ్​ కరోనా వైరస్ వెలుగు చూసింది. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసేందుకు10 మంది ఎక్స్ పర్ట్స్ తో డబ్ల్యూహెచ్ వో ‘10 స్ట్రాంగ్ టీమ్’ను ఏర్పాటు చేసింది.‘‘చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఎక్స్ పర్ట్ టీమ్ పర్యటన జనవరిలో చేపట్టాలని చైనా ఉన్నతస్థాయి అధికారులతో కలిసి టూర్ షెడ్యూల్​ఖరారు చేశాం. ఎక్స్ పర్ట్ టీమ్ స్టార్ట్ అవడానికి ముందే.. ఈ పర్యటన ఎంత కీలకమైందో చైనాకు క్లియర్ గా చెప్పాం. అయినప్పటికీ టూర్​కు అవసరమైన అధికారిక అనుమతుల ప్రక్రియను చైనా పూర్తి చేయలేదు. ఇది తెలిసి నేను తీవ్ర అసంతృప్తికి గురయ్యాను” అని డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రియేసస్ జెనీవాలో మీడియాకు తెలిపారు. డబ్ల్యూహెచ్ వో టాప్ ఎక్స్ పర్ట్ పీటర్ బెన్​ఎంబరేక్​ఆధ్వర్యంలో కొనసాగే ఈ ఇన్వెస్టిగేషన్ ​డబ్ల్యూహెచ్ వో తోపాటు ప్రపంచమంతటికీ ఎంతో ఇంపార్టెంట్ అని ఆయన చెప్పారు. డబ్ల్యూహెచ్​వో  ఎమర్జెన్సీ చీఫ్ మైక్​ ర్యాన్ మాట్లాడుతూ చైనా చర్యతో ఇప్పటికే వారి స్వస్థలాల నుంచి చైనాకు బయల్దేరిన ఇద్దరు ఎక్స్ పర్ట్ టీమ్ సభ్యుల్లో ఒకరు జెనీవాకు రిటర్న్ అయ్యారు. మరొకరు వారి స్వదేశానికి వెళ్తున్నారని చెప్పారు.

మిస్ అండర్ స్టాండింగే కారణం: చైనా

డబ్ల్యూహెచ్ వో టీం చైనాలో పర్యటించేందుకు పర్మిషన్లు రాకపోవడం వెనక ఏదో మిస్ అండర్ స్టాండింగ్ ఉందని బుధవారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు. ఎక్స్ పర్ట్ టీం పర్యటనకు డేట్లు ఖరారు చేసే విషయంపై డబ్ల్యూహెచ్ వో, తమ ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. దీనిపై రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే డబ్ల్యూహెచ్ వో టీం చైనాలో పర్యటించేందుకు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి

సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు

రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్

Latest Updates