రాజీవ్​ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చైనా విరాళాలు

అందుకే ఆదేశానికి కాంగ్రెస్ సపోర్ట్
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: మన దేశం, చైనా మధ్య టెన్షన్లు నెలకొన్న సమయంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. చైనాతో కాంగ్రెస్ పార్టీకి మంచి సంబంధాలున్నాయని తెలిపారు. అందుకే ఆ పార్టీ నేతలు చైనాకు మద్దతుగా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందుకు ఆధారాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ ట్రస్ట్ కు చైనా ఎంబసీ రూ. 90 లక్షలు విరాళం ఇచ్చిన వివరాలను ఆయన బయటపెట్టారు. ” సోనియా, రాహుల్ గాంధీ లు కేంద్రంపై విమర్శలు చేస్తూ చైనాకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇందుకు కారణం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా విరాళాలు ఇవ్వటమే ” అని చెప్పారు. అంతేకాకుండా మన దేశానికి తీవ్రంగా నష్టం జరిగేలా చైనాతో వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. “చైనాకు ముందు వీళ్లు ల్యాండ్ ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా రూ. 90 లక్షలు చారిటీకి తీసుకున్నారు. రాజీవ్ ట్రస్ట్ అంటే అది కాంగ్రెస్ పార్టీయే. డబ్బులు తీసుకునేందుకు పర్మిషన్ తీసుకున్నా రా ? ఆ డబ్బు లు తీసుకున్నట్లు ప్రభుత్వా నికి సమాచారం ఇచ్చారా ? ఇది రూల్స్ ను బ్రేక్ చేయడం కాదా? ” అని మంత్రి చెప్పారు.

Latest Updates