నెబర్ కంట్రీస్ పై చైనా కుట్రలు

  • వైట్ హౌజ్ రిపోర్ట్ లో వెల్లడి

వాషింగ్టన్ : నెబర్ కంట్రీపై చైనా చేస్తున్న కుట్రలను అమెరికా బయటపెట్టింది. ఇండియా పైన చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు వైట్ హౌజ్ రిలీజ్ చేసిన ఓ రిపోర్ట్ తెలిపింది. బలవంతంగా ఆర్మీ బార్డర్ వద్ద పొరుగు దేశాల సైనికులతో లొల్లి కి దిగుతుందని రిపోర్ట్ లో పేర్కొంది. ఇప్పటికే వైట్ హౌజ్ అధికారి ఒకరు చైనా పై ఇలాంటి ఆరోపణలే చేశారు. ఆ మరుసటి రోజు ఈ రిపోర్ట్ విడుదల అవటం విశేషం. ఇండియా బార్డర్ వద్ద గొడవలకు దిగటం, నేపాల్ ను రెచ్చగొట్టటం వంటి చర్యలు చేస్తోందని తెలిపింది. సౌత్ చైనా సీ, తైవాన్ వ్యవహారంలో మాత్రం చైనా మాట్లాడే మాటలకు చేసే పనులకు అసలు సంబంధమే లేకుండా ఉందని తెలిపింది. చైనా ప్రయోజనాల కోసం ఎవరినైనా బెదిరించే ధోరణి మొదలైందంటూ అమెరికా తెలిపింది. ఎకనమీ పరంగా బలంగా మారుతున్న చైనా ఇతర దేశాలను చెప్పుచేతల్లో పెట్టుకోవాలన్న దురాశకు దిగుతుందని రిపోర్ట్ లో రాసుకొచ్చింది. చైనాను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని కోరింది. చైనా బాధిత దేశాలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. కరోనా వ్యాప్తి కారణంగా తీవ్రంగా డ్యామేజ్ అయిన అమెరికా కొంతకాలంగా చైనా పై తీవ్ర ఆగ్రహంగా ఉంది.

Latest Updates