అరుణాచల్ ప్రదేశ్ లో మోడీ టూర్..వ్యతిరేకించిన చైనా

అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. సమస్యాత్మకమైన ఈ సరిహద్దు రాష్ట్రాన్ని తాము గుర్తించలేదని, సరిహద్దు సమస్యను తీవ్రం చేసే చర్యలకు భారత్ దూరంగా ఉండాలని చైనా సూచించింది. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్ లో అంతర్భాగమని, అక్కడ భారత్ ఎటువంటి కార్యకలాపాలు చేయొద్దని చాన్నాళ్లుగా చైనా వాదిస్తోంది. భారత్-చైనా సరిహద్దు విషయంలో తాము స్థిరమైన, సుస్పష్టమైన వైఖరితో ఉన్నామన్నారు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్.

అరుణాచల్ ప్రదేశ్ ను రాష్ట్రంగా చైనా ప్రభుత్వం ఎన్నడూ గుర్తించలేదన్నారు హువా చున్యింగ్. ఆ రాష్ట్రంలో మోడీ పర్యటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చైనా ఆందోళనలను, ప్రయోజనాలను గౌరవించాలని చైనా సూచించించారు. సరిహద్దు వివాదాన్ని మరింత తీవ్రతరంచేసే చర్యలకు దూరంగా ఉండి ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచేందుకు సాయడాలని భారత్ కు చైనా విజ్ఞప్తి చేశారామె.

చైనా అభ్యంతరాలపై తీవ్రంగా స్పందించింది భారత్. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని, దానిని ఎవరూ విడదీయలేరని స్పష్టంచేసింది. మోడీ పర్యటనపై చైనా అభ్యంతరాన్ని ఖండించింది. భారత నాయకులు దేశంలోని అన్ని ప్రాంతాలను సందర్శించినట్టే అరుణాచల్ ప్రదేశ్ ను సందర్శిస్తున్నారని విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత స్థిరమైన వైఖరిని ఎన్నో సందర్భాల్లో చైనాకు స్పష్టం చేశామని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

వాస్తవాధీన రేఖలో 3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు విషయంలో భారత్, చైనా మధ్య చాలకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు ఇప్పటిదాకా 21 సార్లు చర్చలు జరిపాయి. అయినా చైనా దురాక్రమణ ధోరణితో ల్ల సమస్య పరిష్కారం కావడంలేదు.

Latest Updates