కరోనాపై చైనా తప్పుడు సమాచారం ఇస్తుంది: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంలో  చైనాపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా విషయంలో చైనా చాలా తెలివితక్కువగా తన దేశాన్ని సమర్థించుకుంటోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులకు కారణమవుతున్న కరోనా‌ గురించి తప్పుడు సమాచారం ఇస్తూ… ప్రపంచాన్ని చైనా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. తమ దేశంతో పాటు ఐరోపా దేశాలపై చైనా చేస్తున్న తప్పుడు ప్రచారం అవమానకరంగా ఉందన్నారు. ఇతర దేశాలకు వైరస్ వ్యాపించకుండా సులభంగానే ఆపేసే అవకాశం చైనాకు ఉండేదని, కానీ వారు అలా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్.

Latest Updates