చైనా : తొలిదశ ట్రయల్స్ లో మంచి ఫలితాలు

ప్రపంచదేశాలు కరోనా వైరస్ తో గడగడలాడుతుంటే..చైనా మాత్రం కరోనా వైరస్ ను అంతం చేసేందుకు వ్యాక్సిన్ ను తయారు చేస్తుంది.

తాజాగా చైనా మూడో వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్ కు అనుమతిచ్చింది. వ్యాక్సిన్ ను చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ (సినోఫార్మ్) నేతృత్వంలో వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో లాజికల్ ప్రాడక్స్ , వూహాన్ వైరాలజీ ల్యాబ్(డబ్ల్యూఐవి), చైనా సైన్యానికి చెందిన రెండు సైంటిస్ట్ కేంద్రాల్లో వ్యాక్సిన్లతో క్లీనికల్ ట్రయల్స్ చేపట్టాయని ప్రభుత్వ మీడియా సంస్థ షిన్హువా ప్రకటించింది.

మంచి ఫలితాల్ని ఇస్తున్న ట్రయల్స్

తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ను మూడు వయసుల వారీగా ఏప్రిల్ 23నుంచి ప్రారంభించినట్లు సీనో ఫార్మా తెలిపింది. తొలిదశ క్లీనికల్ ట్రయల్స్ లో 96మందికి ప్రయోగించినట్లు..వారి ఆరోగ్యం బాగునట్లు చెప్పింది. ఇక మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ పూర్తయిన తరువాత వాటి పనితీరు తెలుసుకునేందుకు  సంవత్సరం పడుతుందని సీనో ఫార్మా ప్రతినిధులు వెల్లడించారు.

అవన్నీ వదంతులే

చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీకైనట్లు అమెరికాతో పాటు పలు దేశాలు ఆరోపిస్తున్న విషయం తెలిసింది. అంతేకాదు వైరస్ పై సమగ్ర విచారణ జరిపించాలని అమెరికా డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్లు, ఆరోపణలపై స్పందించిన..వుహాన్ వైరాలజీ ల్యాబ్ ప్రతినిధులు..వైరస్ పై వస్తున్న వదంతుల ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు.

Latest Updates