చైనా రక్షణ బడ్జెట్‌ 179 బిలియన్‌ డాలర్లు

  • మన కంటే మూడు రెట్లు ఎక్కువ
  •  ఈ ఏడాది కేటాయింపుల్లో కొంచమే పెరుగుదల
  •  కరోనానే కారణం

బీజింగ్‌: యూఎస్‌ తర్వాత మిలటరీపై అధికంగా ఖర్చు చేసే దేశంగా పేరు ఉన్న చైనా ఈ సారి డిఫెన్స్‌కు తన బడ్జెట్‌లో 179 మిలియన్‌ డాలర్లను కేటాయించింది. మన దేశం డిఫెన్స్‌కు కేటాయించిన దాని కంటే మూడు రెట్టు ఎక్కువ. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ సారి కేవలం 6.6 శాతం మాత్రమే పెంచినట్లు నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌సీపీ)లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ద్వారా తెలుస్తోంది. కరోనా కారణంగా కేటాయింపుల్లో కోతలు పెట్టినట్లు అధికారులు చెప్పారు. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ ఇంక్రిమెంట్‌ ఇదే మొదటిసారని అన్నారు. 2019లో డిఫెన్స్‌కు 177.61 బిలియన్‌ డాలర్లు కేటాయించగా.. 2020లో దాన్ని 179 బిలియన్‌ డాలర్లకు పెంచారు. 2019లో చైనా రక్షణ సంస్థకు చేసిన వ్యయం అమెరికాలో పావు శాతం మాత్రమే అని రిపోర్ట్‌ రిలీజ్‌ చేశారు. కాగా.. తాము మిలటరీపై ఎంత ఖర్చుపెడుతున్నాం, డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే విషయంపై 2007 నుంచి యూఎన్‌కు నివేదిక అందిస్తున్నామని ఎన్‌పీసీ అధికార ప్రతినిధి మీడియాతో చెప్పారు.

Latest Updates