చైనాలో ఏం జరుగుతుంది : చేతులకు సెలైన్ బాటిళ్లతో.. ఆస్పత్రుల్లోనే పిల్లల హోంవర్క్

చైనాలో ఏం జరుగుతుంది : చేతులకు సెలైన్ బాటిళ్లతో.. ఆస్పత్రుల్లోనే పిల్లల హోంవర్క్

చైనా ఆస్పత్రులు  పాఠశాలలుగా మారాయి.  ఓ చేతికి ఫ్లూయిడ్స్ ఇచ్చే సూది.. మరో చేతిలో పెన్ను .. పుస్తకం ఇలా దర్శనమిస్తున్నాయి.  న్యుమోనియాకు చికిత్స పొందుతున్న చిన్నారులు చదువుకునేందుకు అనుగుణంగా ఆస్ప్రతులను సెట్​ చేస్తున్నారు.  పిల్లలు చదువుకొనేందుకు.. హోం వర్క్​ చేసేందుకు వీలుగా డెస్క్‌లు, కుర్చీలను ఎలివేటెడ్ ఇన్ఫ్యూషన్ ఫ్రేమ్‌లతో తయారు చేశారు. చికిత్స తీసుకుంటూ చదువుకోవడంపై చైనా సోషల్​ మీడియాలో  చర్చ జరుగుతుంది. అనారోగ్యంతో బాధపడే పిల్లలపై చదువు ఒత్తిడి చూపుతుంది.  వారికి ఆరోగ్యం సరిగా లేక పోయినా చదువును కొనసాగించేందుకు ఆశక్తి చూపుతున్నారు.   

స్టేట్ బ్రాడ్‌కాస్టర్ CCTV  లో రికార్డైన విజువల్స్​ ప్రకారంగా  ఆసుపత్రిలో   హోంవర్క్ చేస్తున్న విద్యార్థుల ఫోటోగ్రాఫ్‌లు నెటిజన్లను  ఆకర్షించాయి.  ఆసుపత్రిలో ఉన్న సమయంలో  పిల్లలు యాక్టివ్​ గా చదువుచున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు.  ఒక పేరెంట్​ మాట్లాడుతూ  .. నా పిల్లవాడిని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చదువుకోవాలని అనుకోను... కాని హాస్పటల్​ లో  వాతావరణం చాలా బాగుందని అందుకే మా పిల్లవాడు హోం వర్క్​ చేస్తున్నాడన్నారు.  ఇలా చేయడం వలన కోలుకున్న తరువాత తిరిగి పాఠశాలకు వెళ్లేటప్పుడు చదువులో వెనుకబడరని... అందుకే ఆస్పత్రిలో కూడా హోం వర్క్​ పూర్తి చేస్తున్నారని మరొక పేరంట్​ అన్నారు. 

కోవిడ్ మహమ్మారి తరువాత చైనాలో ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది. తాజాగా చైనాలో చిన్న పిల్లలు  శ్వాసకోశ సంబంధిత సమస్యలతో చిన్నారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారని తెలిసి మరోసారి ప్రపంచం దృష్టి చైనాపై పడింది. కోవిడ్ ఆంక్షలు సడలించాక పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధుల కట్టడికి చైనా చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఫీవర్ క్లినిక్‌ల సంఖ్యను పెంచాలని ఆదేశాలు ఇచ్చింది. చైనాలో న్యుమోనియా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చిన్న పిల్లలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.

చైనాలో వ్యాపిస్తున్న న్యుమోనియాను భారత ఆరోగ్య సంస్థలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్యశాఖామంత్రి మన్‌సుఖ్ మాండవీయ చెప్పారు. చైనాలో న్యుమోనియా వ్యాప్తిని ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తోంది. ఐసీఎంఆర్, ఆరోగ్య సేవల డైరక్టర్ జనరల్ ఈ విషయంపై దృష్టి సారించారు. అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

చైనాలో చిన్నపిల్లల్లో శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై ఆందోళన వెలిబుచ్చి చైనాను సమాచారం కోరింది. కొంతమంది నిపుణులు ఇది బ్యాక్టిరీయా ఇన్‌ఫెక్షన్ కారణంగా వచ్చే మైకోప్లాస్మా న్యుమోనియా అని చెపుతున్నారు.