ప్రెగ్నెంట్ తో ఉన్న భార్య కోసం కుర్చీగా మారిన భర్త

కష్ట సుఖాల్లో కలిసి ఉంటానని వేద మంత్రాల సాక్షిగా ప్రమాణం. అవగాహనలోపంతో దంపతుల మధ్య మనస్పర్ధలు. ఇగోతో ఒకరు. ఒపికలేకమరొకరు. ఇద్దరిమధ్య ఎప్పుడూ గొడవలే. జాబ్ చేస్తున్న దంపతుల మధ్య ఆదిపత్యపోరు. ఇలాంటి చిన్నచిన్న మనస్పర్ధలతో విడాకుల బాటలో ప్రయాణిస్తున్న దంపతులకు నేనే ఆదర్శం అంటున్నాడు చైనాకు చెందిన ఓ భర్త.

చైనాకు చెందిన ఓ భర్త ప్రెగ్నెంట్ తో ఉన్న తన భార్యను చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అ దంపతులతో పాటు మరికొంతమంది దంపతులు డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు.

అసలే ఆస్పత్రి, అందులోనూ గర్భిణీ అయిన తన భార్య కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో భర్త కుర్చీగా మారాడు.

డాక్టర్ కోసం ఎదురు చూస్తున్న ఓ భర్త ఆస్పత్రిలో కుర్చి కోసం చూశాడు. పురిటినొప్పులతో బాధపడుతున్న భార్య బాధను చూడలేని ఆ భర్త కూర్చీగా మారి భార్యను తన వీపుపై కూర్చోబెట్టుకున్నాడు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భర్తపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Latest Updates