అమెరికా జీపీఎస్‌‌‌‌‌‌‌‌కు డ్రాగన్ కంట్రీ సవాల్

అమెరికా జీపీఎస్‌‌‌‌‌‌‌‌కు డ్రాగన్ కంట్రీ సవాల్
పాక్‌‌‌‌‌‌‌‌తో సహా 100 దేశాల్లో ఇప్పటికే షురూ
ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌గా పెరగనున్న చైనా పవర్

‘బీడో’ రెడీ అంటున్న చైనా

బీజింగ్: అమెరికాకు చైనా టెక్నాలజీ పరంగా పెద్ద సవాల్ విసిరింది. ఆ దేశ జీపీఎస్ కు దీటుగా తమ సొంత నావిగేషన్ సిస్టమ్ “బీడో”ను పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకున్నామని చైనా శుక్రవారం ప్రకటించింది. పాకిస్తాన్ తో సహా ఇప్పటికే 100 దేశాలలో తమ బీడో నావిగేషన్ సేవలు షురూ అయ్యాయని వెల్లడించింది. ఇప్పుడు ప్రపంచమంతటా నావిగేషన్ సర్వీసులను అందించేందుకు సిద్ధమని చెప్పింది. దీంతో అమెరికా జీపీఎస్, రష్యా గ్లోనాస్, ఈయూ గెలీలియో నావిగేషన్లతో పాటుగా పవర్ ఫుల్ నావిగేషన్ ఏర్పాటు చేసుకున్న దేశంగా చైనా నిలిచింది.
శుక్రవారం బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ లో చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్ అధికారికంగా “బీడో”ను ప్రారంభించారు. ఈ సిస్టమ్ లో భాగంగా చివరి శాటిలైట్ అన్నిటెస్టులు పూర్తిచేసుకుని పనిని ప్రారంభించిందని ఆయన ప్రకటించారు.

బీడో అంటే ధ్రువ తార
బీడో అంటే చైనీస్ భాషలో ధ్రువ తార అని అర్థం. నార్త్ స్టార్ అని కూడా పిలిచే ధ్రువతార స్థానాన్ని బట్టి తాము ఉన్న ప్లేస్ తెలుసుకోవడం ప్రాచీన కాలం నుంచే ఉంది. అందుకే.. చైనా తమ నావిగేషన్ సిస్టమ్ కు ఈ పేరును పెట్టింది.

1994 నుంచి..
బీడో ఏర్పాటుకు 1994లో చైనా సర్కార్ ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి చైనాలోని 400 సంస్థలు, వర్సిటీలకు చెందిన 3 లక్షల మంది సైంటిస్టులు, ఇంజనీర్లు దీని తయారీలో పాల్గొన్నా రు. చైనా తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ లో పార్టనర్స్ గా ఉన్న దేశాలలో బీడో సర్వీసులు 2018లోనే ప్రారంభమయ్యాయి.

మొత్తం 59 శాటిలైట్లు
బీడోలో 2000 ఏడాది నుంచి ప్రయోగించిన మొత్తం 59 శాటిలైట్లు ఉన్నాయి. ఇందులో 30 థర్డ్ జనరేషన్ శాటిలైట్లుకాగా, చివరి శాటిలైట్ జూన్ 23న నింగికి చేరింది.

బీడో సిగ్నల్ మంచిగలే..?
ప్రజలకు సాధారణ నావిగేషన్ కోసం బీడో అందించే సివిల్ సిగ్నల్ జీపీఎస్, గెలీలియో కంటే మెరుగ్గా ఏమీలేదని బ్రిటన్లోని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ రీసెర్చ్ అనలిస్ట్ అలెగ్జాండ్రా స్టికింగ్స్ అన్నారు.

మనది రీజనల్ నావిగేషన్..
మన దేశం కూడా ఇప్పటికే సొంత నావిగేషన్ సిస్టమ్ .. ఐఆర్ఎన్ఎస్ఎస్(నావిక్)ను ఏర్పాటు చేసుకుంది. ఇది మనదేశంతో పాటు చుట్టూ 1500 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే సేవలు అందిస్తుంది.

బీడో స్పెషాలిటీస్ ఇవే..
హై డిగ్రీ అక్యురసీతో నావిగేషన్ సేవలు అందిస్తుంది. షార్ట్ మెసేజ్ కమ్యూనికేషన్ (1200 చైనీస్ అక్షరాల వరకు), ఫొటోలను ట్రాన్స్ మిట్ చేస్తుంది.

బీడోతో చైనాకు అడ్వాంటేజీలు ఇవే..
బీడో.. జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో నెట్ వర్క్ లకు గట్టి పోటీ ఇస్తుంది.
ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా జీపీఎస్ కు ఆల్టర్నేటివ్ నావిగేషన్ గా మారుతుంది.
చైనాజియో పొలిటికల్ పవర్, సెక్యూరిటీ పెరుగుతాయి.

For More News..

సమస్యను కేటీఆర్ కు ట్వీట్ చేస్తే కేసులా!

చెన్నై మెట్రోస్టేషన్ కు జయలలిత పేరు

Latest Updates