చైనా-పాక్ బయోవార్..బయోలాజికల్ వార్ఫేర్ పేరుతో ప్రపంచాన్నినాశనం చేసేందుకు కుట్ర

చైనా – పాక్ లు బయోవార్ కు పాల్పడుతున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన మీడియా సంస్థ గ్రూప్ ది క్లాక్సన్ కొన్ని ఆధారాల్ని వెలుగులోకి తెచ్చింది.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ బెల్ట్ అండ్ రోడ్ ప్రోగ్రాం చైనా వలస రాజ్యాల విస్తరణ కోసం పేదదేశాలకు ఆశచూపి నిలకడేలని అప్పులతో ముంచెత్తి ఆదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బదీస్తుందని క్లాక్స్ తెలిపింది.

ఈ బెల్ట్ అండ్ రోడ్ పోగ్రామ్ లో భాగంగా చైనాకు పాక్ సాయం చేస్తే..పాక్ కు నిధులు ఇచ్చేలా ఒప్పొందం కుదుర్చుకోవడమే కాదు బయోవార్ లో భాగస్వామ్యం కల్పించింది.
బయోలాజికల్ వార్ఫేర్ అని పిలిచే బయోవార్ లో భారత్ తో పాటు ఇతర ప్రాశ్చాత్య దేశాలపై బయోవార్ కుట్ర చేస్తున్నాయని,ఇందుకోసం ఇరు దేశాలు మూడేళ్ల రహస్య ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయని స్పష్టం చేసింది.

ఈ బయోవార్ లో భాగంగా 2015 నుంచి చైనాకు చెందిన వుహాన్ వైరాలజీ ల్యాబ్ సైంటిస్ట్ లు పాక్ ఆర్మీ సహకారంతో రావల్పిండిలో ప్రయోగాలు చేస్తున్నట్లు క్లాక్సన్ నివేదించింది.

చైనా యొక్క వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మరియు పాకిస్తాన్ ఆర్మీ డిఫెన్స్ సైన్స్ & టెక్నాలజీ ఆర్గనైజేషన్ ప్రాణాంతకమైన బయో-వార్ సామర్థ్యాలను విస్తరించడానికి ప్రాణాంతక వ్యాధికారకాలపై ప్రయోగాలు చేస్తున్నాయి.

పాకిస్తాన్ లో 7000 మందికి పైగా పాకిస్తాన్ రైతులు, పశువుల కాపరులు మరియు ప్రాణాంతక జంతువులపై మానవుల వ్యాధికారక వ్యాధులపై ఇరు దేశాలు విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నాయని క్లాక్సన్ ప్రకటించింది.

ప్రపంచంలోని కొన్ని ప్రాణాంతక మరియు అంటువ్యాధి వ్యాధికారక కణాలపై పరిశోధనలు చేశాయని వాటిలో వెస్ట్ నైలు వైరస్, మెర్స్-కరోనా వైరస్, క్రిమియన్-కాంగో, రక్తస్రావం జ్వరం వైరస్, థ్రోంబో సైటోపెనియా సిండ్రోమ్ వైరస్, మరియు చికెన్‌ గున్యా వైరస్ లు ఉన్నాయని చెప్పింది. డిసెంబర్ 2017 మరియు మార్చి 9, 2020 మధ్య కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది.

వైరస్ సోకే వెరో కణాలను అందించినందుకు వుహాన్ వైరాలజీ ల్యాబ్ సైంటిస్ట్ లు కృతజ్ఞతలు తెలిపినట్లు క్లాక్సన్ తన నివేదికలో తెలిపింది.

Latest Updates