భారత పర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్

చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ రేపు భారత పర్యటనకు వస్తున్నారు. చెన్నై దగ్గర్లోని మహాబలిపురంలో ప్రధాని మోడీ-జిన్ పింగ్ రెండు రోజులు లు చర్చలు జరుపుతారు. ఇందులో ఎలాంటి MoUలు, ఒప్పందాలు, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటివేమీ ఉండవు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించి ఒకరి అభిప్రాయాలు… మరొకరు తెలుసుకుంటారు. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మాట్లాడుకుంటారు. సోయాబీన్, బాస్మతి కాకుండా ఇతర రకాల బియ్యం ఎగుమతులు, ఉగ్రవాదం, ఉగ్రవాదులకు నిధులు అందడంపైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి.

Latest Updates