కిట్స్ క్వాలిటీ పై ఏజెన్సీలతో చర్చిస్తాం…సమస్య తీరుస్తాం

న్యూఢిల్లీ : చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కరోనా యాంటీ బాడీ టెస్ట్ లు సరిగా పనిచేయకపోవటంపై చైనా ఆవేదన వ్యక్తం చేసింది. కిట్స్ తయారు చేసిన కంపెనీలతో చర్చించి సమస్యను తీరుస్తామని చైనా రాయబారి జీ రింగ్ తెలిపారు. ” ర్యాపిడ్ కిట్లు పనిచేయటం లేదన్న విషయం తెలిసింది. విదేశాలకు ఎగుమతి చేసే మెడికల్ ఎక్విప్ మెంట్ క్వాలిటీ కి మేము ప్రాధాన్యత ఇస్తాం. సమస్య ఎక్కడ వచ్చిందో తెలుసుకుంటాం ” అని చెప్పారు. కరోనా టెస్ట్ ల కోసం యాంటీ రాపిడ్ కిట్లను చైనా నుంచి ఇండియా సహా పలు దేశాలు ఇంపోర్ట్ చేసుకున్నాయి. ఐతే తప్పుడు రిజల్ట్స్ చూపిస్తున్నాయని చాలా దేశాలు కిట్లను వాడటం మానేశాయి. రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఇదే సమస్యతో కిట్లను సీజ్ చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా కిట్లు సరిగా పనిచేయటం లేదని గుర్తించి వీటితో టెస్ట్ లను రెండు రోజుల పాటు నిలిపివేయాలని కోరింది. చైనా కిట్లతో టెస్ట్ చేసినప్పుడు 6 నుంచి 71 శాతం రిజల్ట్స్ తేడా వస్తుందని ఐసీఎంఆర్ గుర్తించింది.

Latest Updates