క‌రోనా క‌ల‌క‌లం : కోడికాళ్ల‌తో వ‌ణికిపోతున్న చైనా

చైనాలో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. వెట్ మార్కెట్ లో దొరికే చికెన్ వ‌ల్ల క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు చైనా ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

డ్రాగ‌న్ కంట్రీకి చెందిన షెంజన్‌లోని షింఫడీ సీఫుడ్‌ మార్కెట్ లో బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ అయిన చికెన్ వింగ్స్ అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి. అయితే ఆ మార్కెట్ లో క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు కావ‌డంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా వైర‌స్ కేసులు ఎందుకు న‌మోద‌వుతున్నాయో తెలుసుకునేందుకు విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ‌లో బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ అయిన చికెన్ వింగ్స్ వ‌ల్ల క‌రోనా వైర‌స్ సోకుతుంద‌ని ప్ర‌క‌టించింది.

బ్రెజిల్ కు చెందిన శాంటా కాట‌రినాలోని ఆరోరా ఆలిమెంటోస్ ఫ్లాంట్ నుంచి సీఫుడ్ ఐట‌మ్స్ తో పాటు కోడి మాంసం చైనా షంఫ‌డీ మార్కెట్ కు ఇంపోర్ట్ అయిన‌ట్లు, రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ ఆధారంగా అక్క‌డి నుంచి వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.

అంతేకాదు బ్రెజిల్ నుంచి కోడిమాంసం తెచ్చిన కార్మికుల‌కు క‌రోనా టెస్ట్ లు చేశామ‌ని, ఆటెస్ట్ ల్లో వారికి నెగిటీవ్ వ‌చ్చిన‌ట్లు తెలిపారు చైనా ఆరోగ్య శాఖ అధికారులు. ఇత‌ర దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్న సీఫుడ్స్ స‌ర‌ఫ‌రాను నిలిపివేశామ‌ని, మార్కెట్ల‌ల‌లో దొరికే సీఫుడ్స్ పై ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చైనా అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

Latest Updates