వ్యాక్సిన్ లేకుండానే కరోనాకు మందు !

  • రెడీ చేస్తున్నామంటున్న చైనా సైంటిస్టులు

బీజింగ్ : కరోనా మహమ్మారి నివారణకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతుంటే కొంతమంది చైనా సైంటిస్టులు మాత్రం వ్యాక్సిన్ అవసరం లేదంటున్నారు. వ్యాక్సిన్ కాకుండా సాధారణ మందు డెవలప్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ డ్రగ్ వాడితే కరోనా నుంచి కోలుకోవచ్చని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన స్టడీని జర్నల్ సెల్ లో ప్రచురించారు. జంతువులపై తాము తయారు చేసిన డ్రగ్ మంచి రిజల్ట్స్ ఇచ్చిందన్నారు. పెకింగ్ యూనివర్సిటీలో ఎలుకలపై న్యూట్రలైజ్ చేసిన యాంటీ బాడీలను ఎక్కించినట్లు ఐదు రోజుల్లో దీని ప్రభావాన్ని గుర్తించినట్లు బీజిగ్ అడ్వా్న్స్డ్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ జెనోమిక్స్ డైరక్టర్ సన్నీ షీ తెలిపారు. డ్రగ్ ప్రభావంతో వైరస్ 2500 యూనిట్లకు పడిపోయినట్లు చెప్పారు. వ్యాక్సిన్ రూపంలో కాకుండా డ్రగ్ రూపంలో మందు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కరోనా నుంచి కోలుకున్న 60 మంది పేషెంట్ల నుంచి యాంటీబాడీలు సేకరించి అందుకు అనుగుణంగా డ్రగ్ సిద్ధం చేశామని సన్నీ చెప్పారు. కరోనా నివారణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తర్వలోనే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి వచ్చే ఏడాది నాటికి డ్రగ్ ను అందుబాటులోకి తెస్తామని సన్నీ షీ తెలిపారు.

Latest Updates