అమెరికాలో రచ్చ.. పండుగ చేసుకుంటున్న ‘డ్రాగన్‌‌‌‌‌‌‌‌’

‘బ్యూటిఫుల్‌‌‌‌‌‌‌‌ సైట్‌‌‌‌‌‌‌‌’ అంటూ ఫొటోలు షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న చైనీయులు

బీజింగ్‌‌‌‌‌‌‌‌: అమెరికాలో జరిగిన రచ్చపై చైనా పండుగ చేసుకుంటోంది. క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన గొడవను ‘బ్యూటిఫుల్‌‌‌‌‌‌‌‌ సైట్‌‌‌‌‌‌‌‌’ అంటూ చైనాకు చెందిన యువత అక్కడి సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. జులై 2019లో హాంకాంగ్‌‌‌‌‌‌‌‌లో నిరసనకారులు లెజిస్లేటివ్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించినప్పుడు అమెరికా దిగువ సభ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాన్సీ పెలోసీ ‘బ్యూటిఫుల్‌‌‌‌‌‌‌‌ సైట్‌‌‌‌‌‌‌‌’ అని కామెంట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాను చైనీయులు తెగ ట్రోల్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. అప్పటి ఫొటోలు, ప్రస్తుతం అమెరికాలో నిరసనకారులు క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించిన ఫొటోలను కంపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ చైనా మీడియా ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ యూత్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ కూడా పెలోసీ కామెంట్స్‌‌‌‌‌‌‌‌ను గుర్తు చేసుకుని ‘బ్యూటిఫుల్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌’ హ్యాష్‌‌‌‌‌‌‌‌ట్యాగ్‌‌‌‌‌‌‌‌ను అక్కడి సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్ చేసింది. హాంకాంగ్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన యూరప్‌‌‌‌‌‌‌‌ ద్వంద్వ వైఖరి ఇప్పుడు అందరికీ తెలుస్తోందని వేలాది మంది కామెంట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.

 

Latest Updates