భారత్‌ సాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం

చైనా ప్రస్తుతం కరోనా వైరస్( కొవిడ్‌-19)తో పెద్ద యుద్ధమే చేస్తోంది. ఆ వైరస్ ను అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఆదేశ సైంటిస్టులు.ఈ క్రమంలో చైనాకు పలు దేశాలు తమదైన రీతిలో సహాయం అందించాయి. భారత్‌ నుంచి చైనాకు భారీ ఎత్తులో వైద్య పరికరాల సరఫరా జరుగుతోంది. ఇందులో భాగంగా కృతజ్ఞత తెలియజేస్తూ చైనా తమకు సాయమందించిన 57 దేశాల లిస్టును విడుదల చేసింది. అయితే ఇందులో భారత్‌ పేరు లేకపోవడంతో పలువురు భారతీయులు కోపం వ్యక్తం చేశారు. దీంతో జరిగిన పొరబాటును గుర్తించిన చైనా రాయబారి సున్‌ వీడోంగ్‌ దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు. కోవిడ్-19 విషయంలో భారత్ అందిస్తున్న సాయాన్ని అభినందించారు. కష్టకాలంలో భారత్‌ ఎప్పుడూ మా వెన్నంటే ఉందని, వారి సాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని స్పష్టం చేశారు. చైనా కష్టాల్లో ఉన్న ప్రతిసారీ భారత్ స్నేహ హస్తం అందిస్తూనే ఉందని వీడోంగ్ అన్నారు. 2003లో సార్స్ వైరస్ ప్రబలినప్పుడు కూడా భారత్ తమకు అండగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు.

 

Latest Updates