చైనా, తైవాన్లు ఒకే కంట్రీ… ఎవ్వరూ విడదీయలేరు

  • తైవాన్ ప్రెసిడెంట్ కామెంట్లకు డ్రాగన్ కౌంటర్

బీజింగ్ : చైనా నుంచి తైవాన్ వేరే చేసే ఎలాంటి చర్యలను సహించేది లేదని డ్రాగన్ కంట్రీ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో బయట వారి ప్రమేయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని చైనా తైవాన్ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి జియోగాంగ్ తేల్చిచెప్పారు. తైవాన్ అధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికైన డాక్టర్ త్సాయి ఇన్ వెన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా చైనా ఈ ప్రకటన చేసింది. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇన్ వెన్ తైవాన్ స్వాతంత్ర్య కాంక్షను మరోసారి బయటపెట్టారు. ఎన్నిసవాళ్లు ఎదురైన చైనా చెప్పినట్లు ఉండేది లేదన్నారు. తైవాన్ సార్వభౌమాత్వాన్ని కాపాడుకుంటామన్నారు. దీంతో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ ఎప్పటికీ చైనాలో భాగమేనని తేల్చిచెప్పింది. చైనా నుంచి తైవాన్ ను విడదీయాలని ప్రయత్నించే వారి ఆటలు సాగవన్నారు. త్సాయి ఇంగ్ వెన్ తైవాన్ అధ్యక్షురాలిగా 2016 లో ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కూడా తైవాన్ ను చైనాలో అంతర్భాగంగా గుర్తించటాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. చైనా మాత్రం వన్ కంట్రీ టూ పాలసీస్ అనే విధానానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది.

Latest Updates