గల్వాన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా

భారత్ ఆర్మీకి చెందిన 20 మంది ప్రాణాలు కోల్పోయిన గాల్వన్ నదీ లోయ ప్రాంతం నుంచి చైనా తమ బలగాలను ఉపసంహరించుకుంది. జూన్ 15న గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక మేజర్ తో సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచి గాల్వన్ లోయలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతాన్ని భారత ప్రధాని మోడీ గత శుక్రవారం సడెన్ విజిట్ చేశారు. ఆ విజిట్ జరిగిన మూడు రోజుల తర్వాత చైనా తన బలగాలను ఒక కిలోమీటర్ వరకు వెనకకు తీసుకుంది. అయితే చైనా తీసుకున్న నిర్ణయం శాశ్వతమైనదా లేక తాత్కలికమైనదా అనే విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గాల్వన్ నుంచి తమ తమ బలగాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఇరు దేశాల అధికారులు తెలిపారు.

గాల్వన్ వ్యాలీ ఘర్షణ తర్వాత.. భారత మరియు చైనా సైన్యాల కమాండర్లు మూడవ విడత చర్చల కోసం గత వారం సమావేశమయ్యారు. ఈ సమావేశాలలో భారత్ మరియు చైనా మధ్య వాస్తవ సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతను తగ్గించడంపై దృష్టి సారించాయి. సోమవారం చైనా తన బలగాలను వెనకకు వెళ్లడానికి అంగీకరించింది. దాంతో చర్చలలో పురోగతి ఉందని సైనిక వర్గాలు తెలిపాయి.

ఇటీవలి విడుదలయిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా.. గల్వాన్ లోయలో 423 మీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో భారీగా ఆయుధాలు, సైన్యాన్ని మోహరించినట్లు తెలుస్తోంది. పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో కూడా చైనా బలగాలను దించింది. ప్రస్తుత చర్చల తర్వాత చైనా అన్ని ప్రాంతాల నుంచి తమ బలగాలను ఖాళీ చేసింది.

For More News..

లాక్ డౌన్ కష్టాలు : డబ్బు కోసం మేనేజర్ ను ఆఫీస్ లో కట్టేసి చిత్రహింసలు చేసిన యజమాని

గాలి ద్వారా కరోనావైరస్.. ఆధారాలున్నాయంటున్న సైంటిస్టులు

రోజూ 24 కి.మి. సైకిల్‌‌పై బడికి.. టెన్త్‌‌లో టాప్‌‌ సాధించిన రైతు బిడ్డ

Latest Updates