క్లినికల్ ట్రయల్స్ కోసం చైనా ఇతర దేశాలపై ఆధారపడుతోంది

ప్రపంచాన్నివణికిస్తున్న కరోనా వైరస్ చైనా నుంచి దాదాపు అన్ని దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం ఇప్పుడు చైనాలో వైరస్ ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. దీంతో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుకూల పరిస్థితి లేదు. చైనాకు చెందిన కాన్సినో బయోలాజిక్స్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కు చేరుకుంది.

అయితే చైనాలో ఇప్పుడు కరోనా తీవ్రత లేకపోవడంతో, క్లినికల్ ట్రయల్స్ కు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రష్యా, చిలీ, సౌదీ అరేబియా, బ్రెజిల్ దేశాలతో కాన్సినో బయోలాజిక్స్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. తమకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కోసం సుమారు 40 వేల మంది వలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చి, ఫలితాలను తెలుసుకోవాలని  కాన్సినో బయోలాజిక్స్ భావిస్తోంది.

Latest Updates