మహారాష్ట్రలో గ్రేట్ వాల్ మోటార్స్

  • ఇండియా ఎంట్రీ ఇస్తున్న చైనా కార్ల కంపెనీ
  •  ఎస్‌యూవీలకు ఫేమస్‌
  • రూ.7,600 కోట్ల పెట్టు బడి

ఇండియా–చైనా సరిహద్దుల్లోఅశాంతి నెలకొన్న ఈ టైంలోనే , చైనాకి చెందిన కార్ల తయారీ కంపెనీ గ్రేట్‌ వాల్‌ ‌మోటార్స్‌ మనదేశంలోకి ఎంటరవుతోంది. చైనాకు చెందిన ఈ ఎస్‌యూవీ మేకర్ గ్రేట్‌వాల్ మోటార్స్ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. మహారాష్ట్రలోని తలే గావ్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,612 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. దీని వల్లమూడు వేల మందికి జాబ్స్ వస్తాయి. సరి హద్దుల్లోని లడఖ్ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు కొట్టుకోవడంతో ఒక ఆఫీసర్, ఇద్దరు సైనికులు మరణించడంతో ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. సీనియర్ ఆఫీసర్లు రంగంలోకి దిగి చర్చలు మొదలు పెట్టారు . గత కొన్ని నెలలుగా ఇరు దేశాల వ్యాపా ర సంబంధాలు కూడా బలహీనపడ్డాయి . కరోనా వల్ల ఇండియా కంపెనీలు బలహీనపడ్డాయి కాబట్టి వీటిలో తమ వాటాలు పెంచుకోవడానికి చైనా కంపెనీలు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు రావడంతో మోడీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఇండియాకు పొరుగు దేశాలు నుంచి వచ్చే ఇన్వెస్ట్ ‌మెంట్లకు అన్ని రకాల అనుమతులు తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. స్థానిక ప్రొడక్టులకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని మోడీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. కరోనాకు చైనాయే కారణమంటూ పెద్దఎత్తున ప్రచారం జరగడంతో డ్రాగన్ వస్తువులను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

 ఇది వరకే ఒక ప్లాంటు

తలేగావ్‌ లోని జనరల్ మోటార్స్ ఫ్యాక్టరీని కొన్ని నెలల క్రితమే గ్రేట్వాల్ మోటార్స్ కొనుగోలు చేసింది. తాజాగా ప్లాంటు నిర్మాణం కోసం ఉద్దేశించి న ఎంఓయూపై కంపెనీ ప్రెసిడెంట్ జేమ్స్ యాంగ్, గ్రే ట్‌వాల్ మోటార్స్ ఇండియన్ సబ్సిడరీ ఎండీ పార్కర్ షీ, ఇండియాలో చైనా రాయబారి సన్ వీడాంగ్, మహా రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఈ రాష్ట్ర పరిశ్రమల మంత్రి సుభాష్ దేశాయ్ సంతకాలు పెట్టారు . వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇండియాలో గ్రేట్‌వాల్ మోటార్స్ ఆపరేషన్స్ కోసం షి, యాంగ్‌లను కంపెనీ గత నెల 28న నియమించింది. ప్లాంటు ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని ఈ సందర్భంగా పార్కర్ షీ ప్రశంసించారు. ‘‘తలేగావ్‌లో నిర్మించే ప్లాంటులో రోబోటిక్ టెక్నాలజీని వాడుతాం. ఇందుకోసం ప్రొడక్షన్ ప్రాసెస్ లను ఇంటిగ్రేట్ చేస్తాం. ఇక్కడ ప్రపంచస్థాయి ప్రీమియం వెహికల్స్ ‌ను తయారు చేస్తాం. ఆర్ అండ్ డీ సెంటర్‌‌ను సైతం నిర్మిస్తాం. క్రమంగా ఇన్వెస్ట్‌ మెంటు విలువను బిలియన్ డాలర్లకు చేర్చు తాం”అనిపార్కర్ వివరించారు. తలేగావ్ ఇండస్ట్రియ ల్ పార్కును 300 ఎకరాల్లోనిర్మించారు. ఇది ముంబై పోర్టుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చైనా ప్రభుత్వ కంపెనీ ఎస్ఏఐసీకి చెందిన ఎంజీ మోటార్స్ ఇది వరకే ఇండియా మార్కెట్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇది గత ఏడాది హెక్టర్ ఎస్ యూవీ లాంచ్ చేసింది. గ్రేట్‌వాల్ మోటార్స్ ‌ను హెబే ప్రావిన్సులో 1984లో స్టార్ చేశారు.

Latest Updates