చైనా అత్యంత ధనవంతుడు జోంగ్‌ షాన్షాన్‌

అలీబాబా గ్రూప్స్‌ వ్యవస్థాపకుడు, ఆసియాలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన జాక్‌మా నెంబర్‌ వన్ స్థానాన్ని కోల్పోయారు. ఇప్పటి వరకు చైనాలో నెంబర్‌ 1 ధనవంతుడు అనగానే జాక్‌మా పేరు తప్ప మరో పేరు వినిపించేది కాదు. ఇప్పుడు ఆయన స్థానాన్ని ఆక్రమించాడు బడా వ్యాపారి జోంగ్‌ షాన్షాన్‌. ఆయనకు నాంగూఫూ స్ప్రింగ్‌ కో అనే వాటర్‌ బాటిల్స్‌తో పాటు వ్యాక్సిన్లు తయారుచేసే సంస్థలు ఉన్నాయి. జోంగ్‌ షాన్షాన్‌ నికర విలువ బుధవారానికి 5870 కోట్ల డాలర్లు(రూ 4.33లక్షల కోట్లు) బ్లూమ్‌బర్గ్‌ బిలినియర్స్‌ సూచి విడుదల చేసిన నివేదికలో తేలింది. అంటే జాక్‌మా కంటే 2 బిలియన్‌ డాలర్లు అధికమం. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్‌ బుధవారం ఒక్కసారిగా కుదేలు అవ్వడంతోనే ఆయన అత్యంత ధనవంతుల లిస్టులో చేరిపోయారు. ప్రపంచ కుబేరుల్లో చార్లేస్‌ కోచ్‌, ఫిల్‌ నైట్‌ను దాటి 17వ స్థానానికి చేరుకున్నాడు. లోన్‌ ఉల్ఫ్‌ అని ముద్దుగా పిలుచుకునే ఆయన ఆదాయం 2020లో ఒక్కసారిగా పెరిగిపోయింది. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెబోజ్‌, టెస్లా అధినేత ఎలోన్‌ మస్క్‌ వంటి బడా వ్యాపార వేత్తల సరసన చేరారు.

Latest Updates