కరోనా డేటా లేట్‌‌గా ఇచ్చిన చైనా..WHO అధికారుల అసంతృప్తి

వాషింగ్టన్: డబ్ల్యూహెచ్​వో కోరినా .. చైనా అధికారులు కరోనా జెనెటిక్​ మ్యాప్, జీనోమ్​ కు సంబంధించిన వివరాలు ఇవ్వడంలో ఆలస్యం చేశారట. చైనా ప్రభుత్వ ల్యాబ్స్​ జెనెటిక్​ మ్యాప్​ను పూర్తిగా డీకోడ్​ చేసిన తర్వాత కూడా ఆ డేటాను డబ్ల్యూహెచ్​వోతో వెంటనే షేర్​ చేసుకోలేదట. యూఎన్​ ఇంటర్నల్​ మీటింగ్స్​లో ఈ విషయంపై చాలా సార్లు చర్చ జరిగినట్టు సమాచారం. తమకు కావాల్సిన సమాచారాన్ని చైనా ఇవ్వలేదని డబ్ల్యూహెచ్​వో అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. వైరస్​ కు సంబంధించిన సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేసినట్టు రికార్డుల్లో పేర్కొన్నట్లు సమాచారం. డిసెంబర్​ చివరి వారంలో కరోనా వైరస్​ ను వూహాన్​ లో గుర్తించారు. వాస్తవానికి జనవరిలో కరోనా వైరస్​ విషయంలో చైనా రెస్పాన్స్​పై పబ్లిక్ గానే డబ్ల్యూహెచ్​వో మెచ్చుకుంది. వైరస్​ జెనెటిక్​ మ్యాప్​ను రిలీజ్​ చేసే విషయంలో వెంటనే స్పందించిందంటూ థ్యాంక్స్​ కూడా చెప్పింది. చైనా కరోనా సమాచారాన్ని ముందుగా షేర్​ చేయలేదంటూ అమెరికా సహా చాలా దేశాలు విమర్శలు చేశాయి. అయినా  డబ్ల్యూహెచ్​వో చైనానే వెనకేసుకొచ్చింది. చైనాకు సపోర్ట్​ చేస్తోందనే కారణంతో అమెరికా ప్రెసిడెంట్​ ట్రంప్​ డబ్ల్యూహెచ్​వోతో సంబంధాలను కట్‌‌చేసుకున్నారు. అయితే చైనా ప్రెసిడెంట్​ జిన్​పింగ్​ మాత్రం తమ దేశం కరోనా సమాచారాన్ని డబ్ల్యూహెచ్​వోకు పూర్తిగా అందించిందని చెప్పుకొచ్చారు.

గేట్స్​ ఫౌండేషన్​ నిధులే దిక్కు

కరోనా విషయంలో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే కారణంతో డబ్ల్యూహెచ్​వోకు అమెరికా సహా చాలా దేశాలు ఫండింగ్​ నిలిపేశాయి. ఇప్పటి వరకూ డబ్ల్యూహెచ్​వోకు ఎక్కువ నిధులు అమెరికా నుంచే అందుతున్నాయి. ఆ తర్వాత బిల్​ అండ్​ మెలిండా గేట్స్​ ఫౌండేషన్​ నుంచి ఎక్కువ ఫండ్స్​ దక్కుతున్నాయి. అమెరికా పూర్తిగా నిధులు ఇవ్వడం నిలిపేయడంతో ఇప్పుడు డబ్ల్యూహెచ్​వోకు గేట్స్​ ఫౌండేషనే అతి పెద్ద స్పాన్సరర్​గా నిలిచింది. 2019లో అమెరికా నుంచి 893 మిలియన్​ డాలర్ల నిధులు వస్తే.. గేట్స్​ ఫౌండేషన్​ నుంచి 531 మిలియన్​ డాలర్ల నిధులు వచ్చాయి. అమెరికా నిధులు ఆపేయడంతో ఇప్పుడు డ‌‌‌‌‌‌‌‌బ్ల్యూహెచ్​వోకుఎక్కువ డ‌‌‌‌‌‌‌‌బ్బులిస్తున్న జాబితాలో  గేట్స్​ ఫౌండేషన్​ మొదటి ప్లేస్​లో నిల‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌నుంది.

ఎల్ఏసీ దగ్గర పెద్ద ఎత్తున చైనా బలగాలు

 

Latest Updates