చైనా ఫుట్‌బాలర్​కు కరోనా

షాంఘై: కరోనా దెబ్బకు స్పోర్ట్స్‌‌ ఈవెంట్సే రద్దయ్యాయి అనుకుంటే.. ఇప్పుడు ప్లేయర్లు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా చైనా స్టార్‌‌ ఫుట్‌‌బాలర్‌‌ వు లీకి కరోనా వైరస్‌‌ సోకిందని చైనీస్‌‌ ఫుట్‌‌బాల్‌‌ ఫెడరేషన్‌‌ (సీఎఫ్‌‌ఏ) శనివారం తెలిపింది. లీకి వైరస్‌‌ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. స్పెయిన్‌‌ ఫుట్‌‌బాల్‌‌ లీగ్‌‌ ఎస్పానోల్‌‌ ఆడుతున్న 28 ఏళ్ల లీ.. ప్రస్తుతం బార్సిలోనాలోనే సెల్ఫ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉన్నాడు. ఫుట్‌‌బాలర్‌‌ త్వరగా కోలుకోవడానికి అవసరమైన వైద్య చికిత్స అందజేస్తామని సీఎఫ్‌‌ఏ పేర్కొంది. ఇక స్కాట్‌‌లాండ్‌‌ మాజీ క్రికెటర్‌‌, పాక్‌‌ సంతతికి చెందిన మాజిద్‌‌ హక్‌‌కు కూడా కరోనా పాజిటివ్‌‌గా తేలింది. మాజిద్‌‌.. గ్లాస్గోలోని పైస్లే ప్రాంతంలోని రాయల్‌‌ అలెగ్జాండ్రియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆఫ్​స్పిన్నర్​అయిన 37 ఏళ్ల మాజిద్..​  స్కాట్లాండ్‌‌కు 2006 నుంచి 2015 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ దేశం తరఫున 54 వన్డేలు, 24 టీ20లు ఆడాడు.

Latest Updates