చైనా దిగుమతులను ఆపేస్తే నష్టమా? లాభమా?

  • లోకల్‌గా తయారీని బలోపేతం చేయడమే బాయ్‌కాట్‌ చైనా
  •  పీటీఐ ఇంటర్యూలో మారుతీ సుజుకీ చైర్మన్‌ ఆర్‌‌‌‌సీ బార్గవ

బాయ్‌‌కాట్‌‌ చైనా ప్రొడక్స్‌ ట్అంటేఇండియన్‌‌ మాన్యూఫాక్చరింగ్‌‌ను మరింతగా బలోపేతం చేయడమని కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ చైర్మన్‌‌ ఆర్‌‌సీ భారవ అన్నారు. పక్క దేశాల నుంచి దిగుమతులను హఠాత్తుగా ఆపేస్తే ఇప్పుడున్న ప్రొడక్ట్ కే కన్జూమర్లు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుందని  పేర్కొన్నారు. ఏ కంపెనీ కూడా దిగుమతులు చేసుకోవడానికి ఇష్ట పడదని భారవ్గ చెప్పారు. కొన్ని ప్రొడక్ట్ లు లోకల్‌‌గా అందుబాటులో లేకపోవడం, ఉన్నా క్వాలిటీ సరిగ్గా లేకపోవడం, ధరలు ఎక్కువ గా ఉండడం వంటి కారణాల వలనే ఏదైనా కంపెనీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందని అన్నారు. రూపాయి బలహీనపడిన ప్రతిసారీ దిగుమతులు మరింత ఖరీదుగా మారుతాయని భారవ్గ చెప్పారు. పదేళ్ల కిందట దిగుమతి చేసుకునే ఒక ప్రొడక్ట్ ప్రస్తుతం 60–70 శాతం ఎక్కువ ఖరీదుగా మారిందని చెప్పారు. అందుకే లాభం కోసం ఎవరూ దిగుమతి చేసుకోరని, లోకల్‌‌గా దొరకడంలో ఇబ్బందుల వలనే దిగుమతి చేసుకుంటారని పీటీఐ ఇంటర్యూలో భారవ్గ అన్నారు. ‘బాయ్‌‌కాట్‌ ‌చైనీస్‌ ‌ఇంపోర్ట్స్ అంటే ఇండియన్‌ మాన్యూఫాక్చరింగ్‌‌ను మరింత లోతుగా, ధృడంగా బలోపేతం చేయడమే. ప్రధాని ప్రకటించిన ‘ఆత్మనిర్భర్‌‌’ముఖ్య ఉద్దేశం అదే. లోకల్‌‌గా కాంపిటే టివ్‌‌ ధరకే ప్రొడక్ట్లను తయారు చేసుకుంటే ఎవరూ వీటిని దిగుమతిచేసుకోరు’అనిభారవ్గ పేర్కొన్నారు.

కన్జూ మర్లు ఎక్కువ ఖర్చుచేయాల్సి ఉంటుంది

దిగుమతులను ఆపేయడం వలన ఇండియాకు లాభమా? నష్టమా? అనే దానిపై భారవ్గ మాట్లాడారు. ‘నాన్‌ ‌ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ కు దిగుమతి చేసుకోవడం ఆపేయడం వలన ఇండియాకు నష్టం ఉండదు. కానీ ఎసెన్షియల్ ప్రొడక్ట్ లను దిగుమతి చేసుకోవడం ఆపేస్తే అది చైనా కన్నా మనకే ఎక్కువగా నష్టపరుస్తుంది. వేరొక ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో చైనా దిగుమతులను ఆపేయడం సాధ్యం కాదు’అనిభారవ్గ చెప్పారు. ఈ ప్రత్యమ్నాయ దిగుమతులను ఎక్కువ ఖరీదుగా ఉండకూడదు, లేకపోతే చివరికి కన్జూమర్లే నష్టపోతారని అన్నారు. ‘దిగుమతులు చేసుకునే ఖర్చును చివరికి ఎవరు పే చేస్తారు? కన్జూమర్లే. బాయ్‌‌కాట్‌‌ చైనా ప్రొడక్ట్స్ అంటూ స్లోగన్లిచ్చే వారే కొన్ని సందర్భాలలో సేమ్‌‌ ప్రొడక్ట్స్ ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి వీరు సిద్ధంగా ఉన్నారా?’అని భారవ్గ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని చైనా నుంచి ది గుమతులుచేసుకోవడంలో లాభాన్ని, నష్టాన్ని బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. సెంటి మెంట్స్ ను బట్టి నిర్ణయాలు ఉండకూదని ఆయన చెప్పారు. ‘ఒక వేళ చైనా దిగుమతులను బ్యాన్‌‌ చేశాం అనుకుందాం. 2 శాతం కంటే ఎక్కువ చైనా దిగుమతులను వాడే కారును కన్జూమర్లు పొందలేరు. ఆ 2శాతాన్ని ఆపేసి, కారు తయారీని నిలిపేస్తే ఎవరు ఎక్కువగా నష్టపోతారు. ఇండియా లేదా ఇంకెవరైనానా? ఎన్ని ఉద్యోగాలు పోతాయి? ఎంతమంది తమ జీవనోపాధిని కోల్పోతా రు? ప్రభుత్వం ఎంత ట్యాక్స్ ను నష్టపోతుంది?’ అని భారవ్గ ప్రశ్నించారు.

ఇంపోర్ట్స్ రద్దు పాలసీలు రావు

‘బాయ్‌‌కాట్‌‌చైనా దిగుమతులు’ ఇండియన్‌‌ ఆటో మోటివ్‌‌ సెక్టార్‌‌ను పెద్దగా ఇబ్బంది పెట్టవని భారవ్గ అభిప్రాయపడ్డారు. బార్డలో ఇరు దేశాల మధ్య గొడవలు జరగడంతో ఈ సెంటిమెంట్‌‌ బలపడుతోందని చెప్పారు. పాకిస్తాన్‌‌తో కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయని గుర్తుచేశారు. దిగుమతులను బ్యాన్‌‌ చేయాలనే పాలసీలను ప్రభుత్వం తీసుకురాదని భారవ్గ అభిప్రాయపడ్డారు. ఏదైనా పాలసీని తెచ్చేటప్పుడు లేదా తొలగించేటప్పుడు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుందని, ప్రజల సెంటిమెంట్‌‌కు అనుగుణంగా వారు ఇలాంటి పాలసీలను తీసుకురారని చెప్పారు.

Latest Updates