చైనాలో 8మంది స్కూలు పిల్లల్ని పొడిచాడు

సెంట్రల్‌‌‌‌ చైనాలో తీవ్ర విషాదం జరిగింది. సెలవుల తర్వాత బడులు తెరుచుకున్న మొదటిరోజు ఆనందంగా స్కూల్‌‌‌‌కు వెళ్తున్న పిల్లలపై ఉన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది స్టూడెంట్స్‌‌‌‌ చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సెంట్రల్‌‌‌‌ చైనాలోని చవోయాంగ్పో గ్రేడ్‌‌‌‌ స్కూల్‌‌‌‌లో ఈ ఘోరం జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యే రిలీజ్‌‌‌‌ అయ్యాడని చెప్పారు. చైనాలో స్కూల్‌‌‌‌ పిల్లలపై తరచూ కత్తి దాడులు జరుగుతున్నాయని, అలా జరగకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని పేరెంట్స్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఘటనలో 20 మంది స్టూడెంట్స్‌‌‌‌ గాయపడగా.. ఏప్రిల్‌‌‌‌లో జరిగిన ఘటనలో ఇద్దరు స్టూడెంట్స్‌‌‌‌ చనిపోయారు.

Latest Updates