మన యూనికార్న్‌‌లలో ఫుల్‌‌గా చైనీస్‌‌ మనీ

  • ఇండియన్ స్టార్టప్ లలో పెరిగిన చైనీస్ పెట్టుబడులు
  • రూ.34.788 కోట్లుగా ఇన్వెస్ట్ మెంట్

న్యూఢిల్లీ : ఇండియన్ స్టార్టప్‌‌లలో చైనీస్ ఇన్వెస్ట్‌‌మెంట్లు బాగా పెరిగిపోయాయి. గత నాలుగేళ్లలో చైనీస్ ఇన్వెస్ట్‌‌మెంట్లు మన స్టార్టప్‌‌లలో పన్నెండింతలు పెరిగినట్టు డేటా, అనలటిక్స్ సంస్థ గ్లోబల్‌‌ డేటాలో వెల్లడైంది. అంటే 2016లో 381 మిలియన్ డాలర్లుగా(రూ.2,881 కోట్లుగా) ఉన్న ఈ పెట్టుబడులు, 2019 నాటికి 4.6 బిలియన్ డాలర్లకు(రూ.34,788 కోట్లు) పెరిగినట్టు చెప్పింది. మెజార్టీ పెట్టుబడులు ఇండియాలోని యూనికార్న్‌‌లోకే వచ్చాయి. ఈ యూనికార్న్‌‌లకు చైనా ఇన్వెస్ట్‌‌మెంట్ సంస్థలు, కార్పొరేటర్లు పెట్టుబడులతో సపోర్ట్‌‌గా నిలుస్తున్నారు. 24 యూనికార్న్‌‌లో, 17 యూనికార్న్‌‌లకు చైనాకు చెందిన అలీబాబా, టెన్సంట్ వంటి చైనీస్ ఇన్వెస్ట్‌‌మెంట్ సంస్థలు, కార్పొరేట్లు అండగా ఉన్నట్టు గ్లోబల్‌‌డేటా వెల్లడించింది. అలీబాబా, తన సంబంధిత సంస్థ యాంట్ ఫైనాన్సియల్, ఇతర సంస్థలు కలిసి నాలుగు ఇండియన్ యూనికార్న్‌‌లు పేటీఎం, శ్నాప్‌‌డీల్, బిగ్‌‌బాస్కెట్, జొమాటోలోకి 2.6 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టాయి. టెన్సెంట్, ఇతర సంస్థలతో కలిసి ఐదు యూనికార్న్‌‌లు ఓలా, స్విగ్గీ, హైక్, డ్రీమ్11, బైజూస్‌‌లో 2.4 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్‌‌మెంట్ చేశాయి. 1 బిలియన్ డాలర్లు లేదా ఆపై వాల్యుయేషన్ కలిగి ఉన్న స్టార్టప్‌‌లను యూనికార్న్‌‌లుగా అంటారు. ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌‌లో ఉన్న యాక్టివ్‌‌గా ఉన్న ఇతర చైనీస్ ఇన్వెస్టర్లలో హిల్‌‌హౌస్ క్యాపిటల్ గ్రూప్, చైనా లాడ్జింగ్ గ్రూప్, దీదీ చుక్సింగ్, ఫోసన్, చైనా–యురేషియా ఎకనమిక్ కోఆపరేషన్ ఫండ్‌‌లున్నాయి. గతేడాది వరకు, చైనా ఇండియన్ టెక్ స్టార్టప్‌‌లలో బాగా పెట్టుబడులు పెట్టినట్టు గ్లోబల్ డేటా టెక్ అనలిస్ట్ కిరణ్ రాజ్ అన్నారు.