కరోనా వైరస్ గురించి చైనాకు మొత్తం తెలుసు : కావాలనే రహస్యాల్ని దాస్తోంది

కరోనా వైరస్ వ్యాప్తి కుట్ర కోణంపై అమెరికా – చైనా మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. వైరస్ వ్యాప్తికి మీరంటే మీరే కారణమని ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. కొత్త వైరస్ పై కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు అటు ప్రపంచదేశాల్లోనూ పెరుగుతోంది. ఆరోపణలు చేసుకుంటున్న టైంలో చైనా దౌత్య వేత్తకు అమెరికా సమన్లు జారీ చేయడం మరింత కీలకంగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తిలో కుట్ర కోణంపై, ఆరోపణలపై ఈ  సమన్లు జారీ చేసింది అమెరికా. కరోనా సోకిన తొలి వ్యక్తిని గుర్తించడంలో చైనా విఫలమైందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్ట్ ఆరోపణలు చేయడంతో ఈ వైరస్ వార్ కాస్తా ముదిరింది. మరోవైపు అమెరికన్లంతా.. కరోనా కోవిడ్ వైరస్ ను వుహాన్ వైరస్ లేదంటే చైనా వైరస్ అని పిలుస్తున్నారు. దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

కరోనా సోకిన మొదటి వ్యక్తి ఎవరన్న విషయంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనానే వైరస్ ను ప్రపంచానికి పాకేలా చేసిందని అమెరికా విమర్శిస్తోంది. అసలు చాలా మంది చనిపోయినా.. వైరస్ గురించి నిజాలు చైనా దాచి పెట్టి ఉంచిందని అందుకే ఇది పెండమిక్ స్టేజ్ వరకు వెళ్లిందని యూఎస్ అధికారులు ఫైర్ అవుతున్నారు. అమెరికా ఆర్మీనే ఈ వైరస్ ను చైనాకు తీసుకొచ్చిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాహో.. ట్విట్టర్లో ఆరోపణలు చేశారు. అమెరికాలో వైరస్ కట్టడికి చర్యలు తీసుకోకుండా తమపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని చైనా వాదిస్తోంది. 2019 అక్టోబర్లో చైనా వుహాన్ లో అక్టోబర్ 18 నుంచి 27 వరకు వరల్డ్ మిలటరీ గేమ్స్ జరిగాయి. వంద దేశాల నుంచి సైనికులు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చారు. అప్పుడే అమెరికా మిలటరీ ఈ వైరస్ ను వుహాన్ లోకి తెచ్చిందని చైనా ఆరోపిస్తోంది.

more news –

see this  – కరోనాతో చనిపోయాక కూడా ఆ బాడీ నుంచి వైరస్ సోకుతుందా..?

see this  – ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ మనుషుల కోసం కాదు

see this  – నిర్భయ దోషి మాస్టర్ ప్లాన్ : మరోసారి పిటిషన్ దాఖలు చేసిన వినయ్ శర్మ

Latest Updates