కాక్‌పిట్‌లో అమ్మాయి ఫోజు.. పైలట్‌ పై వేటు

ఓ అమ్మాయికి పైలట్ అతి చనువు ఇచ్చాడు. ఆమెను ఏకంగా కాక్‌పిట్‌లోకి పిలిచి ఫొటోకు ఫోజులిచ్చాడు. దీనికి ఆ విమాన సిబ్బంది కూడా తమవంతు సహకారం అందించారు. ఈ విషయం బయటపడటంతో పైలట్‌తో పాటు అతనికి సహకరించిన సిబ్బందిపై విమానయాన సంస్థ వేటు వేసింది.

చైనాలోని గుయిలిన్ నుంచి యాంగ్జోకు జీటీ 1011 అనే విమాన సర్వీసు బయలుదేరింది. అయితే, విమానం నడిపే పైలట్, ప్రయాణికురాలిని కాక్ పిట్‌లోకి ఆహ్వానించాడు. అంతేకాదు ఆమెతో కలిసి ఫొటోలు దిగాడు.

ఫొటోలు దిగిన ఆమె… తనకెంతో సంతోషంగా ఉందని, కెప్టెన్‌కు ధన్యవాదాలని చెబుతూ, సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో ఎయిర్‌లైన్స్ యాజమాన్యానికి విషయం తెలిసింది. ఎయిర్‌లైన్స్ నిబంధనలకు విరుద్ధంగా సాధారణ ప్రయాణికులను కాక్ పిట్‌లోకి అనుమతించడంతో పాటు ఆమె ఫొటోలు తీయడం నేరమేనని చెబుతూ, అతన్ని విధుల నుంచి బహిష్కరించారు. ఆమెను లోపలికి పంపేందుకు సహకరించిన విమాన సిబ్బందిపైనా చర్యలు చేపట్టారు.

Latest Updates