జిరాఫీ డ్రస్‌లో మహిళ.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు

కరోనా వైరస్  చైనాను ఎంతలా భయపెడుతుందో ఈ సంఘటన చూస్తే అర్ధం అవుతుంది. చైనా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు వైరస్ దాటికి ఇప్పటివరకు 2,004 మంది ప్రాణాలు కోల్పోగా…74,185 మంది చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం ఒక్కరోజే చైనాలో 1,693 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్దారణ జరిగింది. 132 మంది చనిపోయారు. 1824మందికి వ్యాధి నయం అయినట్లు ప్రకటించింది.

అయితే కరోనావైరస్ నుంచి బయటపడేందుకు చైనా ఆరోగ్యశాఖ మాస్క్ లు ధరించాలని సూచించింది. మాస్క్ లు ధరించడం వల్ల వైరస్ నుంచి సురక్షితంగా ఉండొచ్చని తెలిపింది. దీంతో చైనా ప్రజలు మాస్క్ లు కోసం పోటీ పడుతున్నారు. వైద్యశాఖ ప్రకటనతో చైనాలో మాస్క్ లు భారీ ఎత్తున అమ్ముడుపోయాయి. మాస్క్ లు ఉన్నవాళ్లు మాస్క్ లు.. లేనివాళ్లు కవర్లు, ప్లాస్టిక్ డబ్బాలు, లోదుస్తులు, జంతువులను పోలిన దుస్తులు ధరించి భయం భయంగా గడిపేస్తున్నారు.

చైనాలోని లుజుహూ నగరంలో ఓ మహిళ  జిరాఫీ దుస్తులు ధరించింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జిరాఫీ డ్రస్ ధరించడం పై మహిళ మాట్లాడుతూ ఓ వైపు కరోనా వైరస్ భయం.. మరోవైపు ధరించేందుకు మాస్క్ లు లేవు. వైరస్ నుంచి తమని తాము కాపాడుకునేందుకు ఇంతకంటే వేరే మార్గం లేదని తెలిపింది.

Latest Updates