ముస్లిం నాయ‌కుడి కూతురి పెళ్లికి హాజ‌రైన చిన‌జీయ‌ర్ స్వామి

హైదరాబాద్: బంజారా హిల్స్ రోడ్ నెం 12 లోని మసీద్ లో జరిగిన కాంగ్రెస్ నేత రహీమ్ కూతురు వివాహ వేడుకలకు హాజర‌య్యారు  శ్రీత్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి. ఈ సంద‌ర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ….రహీం షఫీ త‌న‌కు మిత్రుడని చెప్పారు. ఆయన కూతురు వివాహానికి రావాలని ప్రత్యేకంగా కోరారని.. అందుకే రహీం షఫీ కుమార్తె వివాహానికి వచ్చానని చెప్పారు.

‘ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. ష‌ఫీ కుమార్తె వివాహానికి హాజరు కావడం ఆనందంగా ఉంది. ఇది సమాజానికి మంచి సందేశం ఇస్తుంది. భారతీయ సంస్కృతి లోనే మతాలకు అతీతంగా జీవించే జీవన విధానం కనిపిస్తుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటేనే ప్రజల్లో సఖ్యత మరింత బలపడుతుంది. ప్రజలంతా వసుధైక కుటుంబం అనే సంప్రదాయాన్ని కొనసాగించాలని’ అన్నారు చిన జీయర్ స్వామి.

Latest Updates