మా పార్టీని గెలిపిస్తే అయోధ్యలో రామ మందిరం కంటే పెద్దగా సీతాదేవి మందిరాన్ని నిర్మిస్తా

అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రామ మందిరం కంటే పెద్దగా సీతాదేవి మందిరాన్ని నిర్మిస్తామనే ప్రతిపాధన తెరపైకి వచ్చింది. సీతమ్మ లేకుండా రాముడు సంపూర్ణుడు కాలేడు.. అలాగే రాముడు లేకుండా సీతమ్మకు సంపూర్ణత్వం ఉండదు. అందుకే బీహార్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే  అయోధ్యలో రామ మందిరానికి  మించిన సీతామాత భవ్య మందిరాన్ని నిర్మిస్తామని లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్  స్పష్టం చేశారు. ఇటీవల బీహార్ ఎన్నికల నేపథ్యంలో చిరాగ్ పాశ్వాన్ మేనిఫెస్టో లో అయోధ్యలో రామాలయం తరహాలో.. సీతామర్హిలో సీతామందిరం నిర్మిస్తామని  పేర్కొన్నారు. ప్రస్తుత సీఎం తిరిగి ముఖ్యమంత్రి కాకుంటే బీజేపీ నాయకత్వంలో మేము బీజేపీ-ఎల్‌జేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం  అని చిరాగ్ తెలిపారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే బీహార్ లోని సీతామర్హి లో సీతాదేవి మందిరం నిర్మించి అక్కడి నుంచి అయోధ్యను కలిపే ఆరు లేన్ల రోడ్ కారిడార్ నిర్మిస్తామని చెప్పారు.

Latest Updates