
సెప్టెంబర్ 13వ తారీఖున యంగ్ హీరో శ్రీ సింహకోడూరి హీరోగా నటించిన మత్తు వదలరా -2 చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం మంచి పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాగా ఈ చిత్రం విడుదలైన మొదటిరోజే దాదాపుగా రూ.5.3 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది.
కామెడీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు తదితరులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించారు.
ఈ క్రమంలో మత్తు వదలరా - 2 చిత్రం చూసానని ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదని అలాగే ఎండ్ టైటిల్స్ ని కూడా వదలకుండా చూసానని పేర్కొన్నాడు. అలాగే రాత , తీత , కోత , మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ వినోద పర్చిన విధానానికి అభినందించకుండా వుండలేము అంటూ ఈ చిత్ర డైరెక్టర్ ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణా ని అభినందించాడు.
Also Read :- కమిట్మెంట్ అడిగాడని డైరెక్టర్ ని
ఇక మహేష్ బాబు కూడా మత్తు వదలరా - 2 చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపాడు. అలాగే ఈ చిత్రంలో వెనెన్ల కిషోర్ మరియు సత్యల కామెడీ ని థన్ కూతురు సితార చాలా బాగా ఎంజాయ్ చేసిందని ట్వీట్ లో పేర్కొన్నాడు. అలాగే హీరో సింహా కోడూరి యాక్టింగ్ ని కూడా మెచ్చుకున్నాడు.
నిన్ననే 'మత్తు వదలరా - 2' చూసాను.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 15, 2024
ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. End Titles ని కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణా కి ఇవ్వాలి.
అతని రాత , తీత , కోత , మోత, ప్రతీది
చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి…
#MathuVadalara2… a laugh riot!! ??? Thoroughly enjoyed it.. Effortless performances by @Simhakoduri23 and the entire cast! #VennelaKishore… my daughter couldn’t stop laughing when you were on screen ? #Satya… we all couldn’t stop laughing when you were on screen……
— Mahesh Babu (@urstrulyMahesh) September 14, 2024