సినీ కార్మికులకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన చిరంజీవి

కరోనా వైరస్ ను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో దినసరి కూలీలు, సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీని ప్రభావం సినిమా ఇండస్ట్రీపై పడింది. సినిమాల నిర్మాణం నిలిచిపోవడంతో  సినీ కార్మికుల  కోసం మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు. లాక్ డౌన్ తప్పనిసరి కావడంతో సినీ కార్మికులపైనా తీవ్ర ప్రభావం పడుతోందని చిరంజీవి ట్విట్టర్ లో తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీపై ఆధారపడిన సినీ కార్మికులకు రూ.1 కోటి విరాళం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తన విరాళం సినీ కార్మికులకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నట్లు తెలిపారు మెగాస్టార్.

Latest Updates