మెగాస్టార్ కు తప్పిన ప్రమాదం!

మెగాస్టార్ చిరంజీవికి  పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.  ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిలైన్స్ విమానం సాంకేతిక లోపం రావడంతో టేకాఫ్ అయిన అరగంటకే మళ్లీ  ముంబై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్ లో మొత్తం 120మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులంతా ఎయిర్ పోర్టులోనే వేచిచూశారు. తర్వాత మరో విమానం ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ పంపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

 

Latest Updates