ట్విట్టర్లోకి మెగాస్టార్.. ఫస్ట్ ట్వీట్ ఇదే…

ట్విట్టర్ ..ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పుకునేందుకు.. ఏదైనా సమాచారాన్ని షేర్ చేసేందుకు  చక్కని వేదిక. ఒకప్పుడు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు మాత్రమే వాడే ఈ ట్విట్టర్ ను ఇపుడు సామాన్యులు కూడా వాడుతున్నారు. ఇక హీరోలు తమ సినిమాల గురించి ఎప్పటికపుడు అప్ డేట్స్ ను  ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న టాలీవుడ్ మెగస్టార్ చిరంజీవి ఇవాళ ఉగాది సందర్భంగా ట్విట్టర్లోకి అడుగుపెట్టారు. అందరికీ శార్వరీ నామ సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ గురించి ప్రస్తావిస్తూ మొదటి ట్వీట్ చేశారు.

కరోనాను జయించేందుకు భారత ప్రభుత్వం అందరినీ 21 రోజులు ఇంట్లోనే ఉండమని ఆదేశించిందని..ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ల ఆదేశాలను పాటించి కరోనాను నిర్మూలిద్దామన్నారు. అందరం ఇంటివద్దే ఉండి సురక్షితంగా ఉందామని పిలుపునిచ్చారు. చిరంజీవి ట్విట్టర్లోకి వచ్చిన కాసేపటికే ఆయనను 61 వేయి మంది  ఫాలో అవుతున్నారు.

 

Latest Updates