కొరటాల మూవీలో కేకపుట్టిస్తున్న చిరు న్యూ లుక్

మెగాస్టార్ చిరంజీవి సైరా తర్వాత తన 152 వ మూవీనీ కొరటాల డైరెక్షన్ లో చేస్తున్నారు. నక్సల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరు లుక్ లీక్ అయ్యింది. ఈ లుక్  ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.  ఎర్రటి కండువా కప్పుకున్న చిరు నిలబడి ఉన్న లుక్ కేక పుట్టిస్తుంది. ఈ లుక్ లో చిరు చాలా సన్నగా కనిపిస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ చాలా ఖుషీ అవుతున్నారు. తన అభిమాన హీరో లుక్ చూసిన ఫ్యాన్స్ తమ హీరో లుక్ 20 ఏళ్ల వెనక్కి వెళ్లినట్లుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

Latest Updates