చిరు చిన్నల్లుడికి వేధింపులు : పోలీసులకు ఫిర్యాదు

కొన్ని రోజులు తనను సోషల్ మీడియా వేదికగా కొందరు వేధిస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతో పాటు తన కుటుంబంపై కూడా అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారంటూ బుధవారం చిరంజీవి చిన్నల్లుడు హీరో కళ్యాణ్ దేవ్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు హీరోను వేధించిన ఆకతాయులను గుర్తించామని తెలిపారు. ఆ పదిమంది అకౌంట్ల డీటెయిల్స్ కోసం ఇన్‌స్ట్రాగ్రామ్‌కు లెటర్ రాసినట్టు చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి వివరాలు అందగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు అదనపు డీసీపీ రఘువీర్.

Latest Updates