సైరా మరో ట్రైలర్ : గ‌డ్డి ప‌రక కూడా గ‌డ్డ దాట‌కూడ‌దు

మెగాస్టార్ చిరంజీవి నటించిన మెగా పవర్ ఫుల్ మూవీ సైరా నరసింహారెడ్డి. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్-2న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపిన యూనిట్..ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే గురువారం సినిమాలోని మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన వీడియోలు, సాంగ్స్ ఆకట్టుకుంటుండగా..ఇవాళ వచ్చిన ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయంటున్నారు ఫ్యాన్స్. ఇందులో చిరు డైలాగ్స్ ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి .

యాక్షన్‌ సీన్స్‌లో చిరు చెప్పిన ‘అది మనది మన ఆత్మగౌరవం.. గ‌డ్డి ప‌రక కూడా గ‌డ్డ దాట‌కూడ‌దు. ‘ అనే డైలాగ్స్ అదుర్స్. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటించగా..అమితాబ్ బ‌చ్చ‌న్‌, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తి బాబు, త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బేన‌ర్‌ పై భారీ బ‌డ్జెట్ తో  రూపొందిన సైరా.. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానుంది.

Latest Updates