రాజశేఖర్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ చిరు ట్వీట్‌

తన సహ నటుడు రాజశేఖర్ కోవిడ్ నుంచి తొందరగా కోలుకోవాల‌ని ఆశిస్తూ.. మెగాస్టార్ చిరంజివి ట్వీట్ చేశారు. రాజశేఖర్ ఫ్యామిలీకి ధైర్యం చెబుతూ… రాజశేఖర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా బయటకు రావాలని అన్నారు. తన తండ్రి త్వరగా క‌రోనా నుంచి కోలుకొని ఇంటికి రావాలని కోరుకుంటూ.. రాజ‌శేఖ‌ర్ కూతురు శివాత్మిక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ.. శివాత్మిక..నువ్వు ఎంతగానే ప్రేమించే నీ తండ్రి.. నా తోటి నటుడు అంతకు మించి మంచి మిత్రుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు.

ప్ర‌స్తుతం ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజ‌శేఖ‌ర్‌కు సంబంధించి డాక్ట‌ర్లు హెల్త్ బులిటెన్ విడుద‌లైంది. రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వైద్యులు తెలిపారు.

Latest Updates