చిరంజీవి ఆధ్వర్యంలో సినీ ప్రముఖుల సమావేశం

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీపై కూడా పడింది. దీంతో రెండు నెలలకు పైగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. అయితే లాక్ డౌన్ నిబంధనల నుంచి ఒక్కో రంగానికి సడలింపులు వస్తున్న సమయంలో సినీ పరిశ్రమను తిరిగి ఎలా తెరిపించాలన్న విషయమై ఇవాళ(గురువారం) కీలక సమావేశం జరగనుంది. ప్రముఖ సినీనటుడు చిరంజీవి  ఆధ్వర్యంలో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నట్లు తెలుస్తొంది. థియేటర్స్ విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయం, షూటింగ్స్ ప్రారంభిస్తే  చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదే సమావేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ సమావేశంలో పలువురు నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు హాజరు కానున్నారని తెలుస్తోంది.

Latest Updates