వీరాభిమాని మృతి.. విషాదంలో మెగా హీరోలు

గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు, మెగా అభిమాని నూర్ మహ్మద్ ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి వెంటనే తన అభిమాని ఇంటికి చేరుకుని ఆయనకు నివాళి  అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..  తన వీరాభిమాని అయిన నూర్ మహ్మద్ మరణం తీరని లోటన్నారు. తోటి అభిమానులందరికీ బాధాకరమైన సంఘటన అని అన్నారు. ఆయన లోటును పూడ్చలేమన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.

మెగా ఫ్యామిలీని ఆరాధించే నూర్ భాయ్ మృతి ఎంతో కలిచివేసిందని రామ్ చరణ్ అన్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.. అల్లు శిరీష్, సాయిథరమ్ తేజ్ కూడా నూర్ భాయ్ మృతిపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Latest Updates