సాయం కోసం ఎదురుచూస్తున్న చిరు ఫస్ట్ మూవీ డైరెక్టర్

మెగాస్టార్  చిరంజీవి తొలిచిత్రం పునాది రాళ్లు.. ఈ మూవీ డైరెక్టర్ గూడపాటి రాజ్ కుమార్. ఫస్ట్ మూవీకే ఐదు నంది అవార్డులు దక్కించుకున్నారు. అలాంటి డైరెక్టర్, నిర్మాత, రాజ్ కుమార్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్ మెంట్ కు కూడా డబ్బుల్లేని దీనావస్థలో ఉన్నారు. ఎవరైనా సాయం చేస్తారేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. కొడుకు అనారోగ్యంతో మృతి చెందడం, తర్వాత భార్య చనిపోవడంతో ఒంటరివాడయ్యాడు. పైసా సంపాదన లేక అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెల్లదీస్తున్నాడు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికత్స కోసం  ఆర్థిక సాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు.

Latest Updates