చిరూ, మోహన్ బాబుల మల్టీస్టారర్?

ఎన్నో విజయవంతమైన చిత్రాలతో కలెక్షన్ కింగ్‌‌గా పేరు తెచ్చుకున్న మోహన్‌‌ బాబు.. సెకెండ్ ఇన్నింగ్స్‌‌లో కూడా విలక్షణమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం సూర్య హీరోగా సుధ కొంగర రూపొందిస్తున్న ‘సూరారైపోట్రు’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో తెలుగులోకి రానుంది. ఆ మూవీకి సంబంధించిన స్టిల్ ఇది. లుక్‌‌ని బట్టి, గెటప్‌‌ని బట్టి మరో డిఫరెంట్‌‌ అండ్ ఇంపార్టెంట్ రోల్‌‌లో మోహన్‌‌ బాబు కనిపించనున్నారని అర్థమవుతోంది. అయితే చిరంజీవి, కొరటాల శివల చిత్రంలో కూడా మోహన్‌‌బాబు నటించనున్నారనే వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన లేకపోయినా ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. దాంతో కొందరు ఈ లుక్ ఆ సినిమాకి సంబంధించినదే అని కూడా అంటున్నారు. ఫొటో సంగతి ఎలా ఉన్నా.. చాలా యేళ్ల తర్వాత చిరు, మోహన్‌‌బాబు కలిసి నటిస్తున్నారనే వార్తే చాలా కిక్కిస్తోంది. అది నిజమవుతుందో లేదో మరి.

Latest Updates