చిట్ ఫండ్స్ మోసం : వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఖమ్మం నగరంలోని శుభనందిని చిట్ ఫండ్స్ వారు చిట్టి పాడి సంవత్సరం అయినా డబ్బులు ఇవ్వలేదని ఖాతాదారుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. జిల్లాలోని రూరల్ మండలం పెద్ద తండాకు చెందిన బోడ శ్రీనివాస్ శుభనందిని చిట్ ఫండ్స్ లో 10 లక్షలు చిట్టేశాడు.

చిట్టి పాడి వన్ ఇయర్ అయినా ఇప్పటికి చిట్టి డబ్బులు ఇవ్వకపోవడంతో కుటుంబసభ్యులతో పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నం చేశారు. మణుగూరుకు మరో బాధితుడు కూడా చిట్టి డబ్బులు ఇవ్వలేదని ఆందోళకు దిగాడు. డబ్బులు ఇచ్చేంతవరకు బయటకు వెళ్ళమని ఆఫీసులోనే బైఠాయించారు.

 

Latest Updates