
బాగ్దాద్: ఇరాక్లో క్లోరిన్ గ్యాస్ లీక్ అయి, 600 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అర్బాయీన్ సంతాప దినాల సందర్భంగా పవిత్ర స్థలాలైన నజఫ్, కర్బలాకు పెద్ద సంఖ్యలో షియా ముస్లింలు చేరుకుంటున్నారు. అయితే శనివారం రాత్రి కర్బలాకు వెళ్లే రోడ్డులో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ స్టేషన్లో క్లోరిన్ గ్యాస్ లీక్ అయింది. ఈ క్రమంలో 621 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. అధికారులు వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించారు. బాధితులందరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఇరాక్ హెల్త్ మినిస్ట్రీ ఆదివారం తెలిపింది.