డేట్, టైమ్, ప్లేస్ చెప్పండి : సైన్యంతో ప్రధాని మోడీ

యూపీ : పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై ఇవాళ తాను పాల్గొన్న ప్రతీ సభలోనూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సీరియస్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ … బుందేల్ ఖండ్ లోని ఝాన్సీలో డిఫెన్స్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోడీ. ఆ తర్వాత మాట్లాడిన ప్రధానమంత్రి… టెర్రరిస్టులపై పూర్తిస్థాయిలో ప్రతి దాడి చేస్తామని అన్నారు. “వీర సైనికులు వారి ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాలు వృథా పోవు. మన సైన్యం శౌర్య,పరాక్రమాలేంటో దేశానికి, దేశ ప్రజలకు ఇప్పటికే తెలుసు. సైన్యం సత్తాపై దేశానికి ఎటువంటి అనుమానాల్లేవు” అని అన్నారు మోడీ.

ప్రపంచ దేశాలన్నీ మనవైపే ఉన్నాయి

పాక్ వెనుక ఉండి చేయించిన ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ… ప్రపంచంలోని అతిపెద్ద శక్తులు(దేశాలు) అన్నీ మనకే అండగా ఉన్నాయని చెప్పారు మోడీ. ప్రపంచ దేశాధినేతలు ఉగ్రవాదం విషయంలో తమ బాధను మాత్రమే కాదు.. తమ ఆగ్రహాన్ని కూడా తనకు సందేశాల ద్వారా తెలియజేస్తున్నారని అన్నారు.

“పుల్వామాలో భరత మాత బిడ్డలపై దారుణమైన దాడి జరిగింది. బాధ్యులపై ప్రతీకారం తీర్చుకునేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ఉగ్రవాదులను ఏరేసేందుకు.. వారిపై ప్రతీకారానికి టైమ్, ప్లేస్ చెప్పాలని … ఇప్పటికే భారత భద్రతా బలగాలకు అనుమతులు ఇచ్చేశాం” అని మోడీ చెప్పారు.

ఉదయం వందే భారత్ రైలును ప్రారంభించిన సభలో మాట్లాడిన మోడీ.. దేశ ప్రజల రక్తం మరిగిపోతోందని అన్నారు. సెక్యూరిటీ బలగాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామనీ.. ఉగ్రశక్తులు అత్యంత భారీ మూల్యాన్ని చెల్లించబోతున్నాయని చెప్పారు మోడీ.

Latest Updates